జిల్లా కలెక్టర్ తో ఇంటూరి నాగేశ్వరరావు భేటీ
BSBNEWS - NELLORE
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఓ.ఆనంద్ తో కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్చం అందజేశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలపై, అభివృద్ధి కార్యక్రమాల పై కలెక్టర్ తో చర్చలు జరిపారు.

