త్వరలోనే క్రీడా స్టేడియం నిర్మిస్తాము
- అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేస్తాము
- క్రీడా , రవాణా శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి
- కావలి కి త్వరలో మంచి రోజులు రానున్నాయి
- కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి
BSBNEWS - KAVALI
త్వరలోనే కావలి పట్టణంలో సకల వసతులతో క్రీడా స్టేడియం నిర్మిస్తామని క్రీడా, రవాణా శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.. విజయవాడ నుండి రాయచోటికి వెళ్తున్న ఆయన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ఆహ్వానం మేరకు కావలి లోని ఎమ్మెల్యే నివాసానికి విచ్చేశారు. ఎమ్మెల్యే నివాసానికి విచ్చేసిన ఆయనకు ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ఘన స్వాగతం పలికారు.. శాలువాతో సత్కరించి, బొకే అందజేశారు. విచ్చేసిన పార్టీ నాయకులను మంత్రి కి పరిచయం చేశారు. అనంతరం కావలి నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకొని వెళ్లారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అభివృద్ధికి తప్పక సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం దశాబ్దాల కాలంగా క్రీడాకారులకు నిరూపయోగంగా మారిన క్రీడా మైదానాన్ని ఎమ్మెల్యే తో కలిసి మంత్రి పరిశీలించారు.. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రతిరోజు సంక్రాంతి పండుగలా ఉంటుందని తెలిపారు. కావలి లో మంచి స్టేడియం నిర్మాణానికి సహకారం అందిస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దటం జరుగుతుందని తెలిపారు. డిపిఆర్ ప్రిపేర్ చేయిస్తే స్టేడియం నిర్మాణం చేపడతామన్నారు. గత ప్రభుత్వంలో లాగా ఆడంబరాలకు పోయి వారం రోజుల్లో వందల కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెట్టడం కాకుండా, ప్రతి పైసాను అభివృద్ధి, సంక్షేమంకు వెచ్చించడం జరుగుతుందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం జులై ఒకటో తేదీన 4000 కోట్ల రూపాయలతో 28 రకాల పెన్షన్లు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిది అని తెలిపారు. అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వ్యక్తి తెలుగుదేశం ప్రభుత్వంపై ఆవాకులు చవాకులు పేలుస్తున్నారని మండిపడ్డారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం ఆంధ్రప్రదేశ్ లో కూటమికి దక్కిందని తెలిపారు. తన కేసుల మాఫీ కోసం, లాభాల కోసం జగన్ ఢిల్లీకి వెళ్లేవాడిని, చంద్రబాబు మాత్రం కేంద్రంతో పొట్లాడి నిధులు తీసుకువస్తున్నారని అన్నారు.. ఈ ఐదేళ్లపాటు కూటమి ప్రభుత్వం నిధులు సాధిస్తూనే ఉంటుందని తెలిపారు. కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ కావలికి త్వరలోనే మంచి రోజులు రానున్నాయని తెలిపారు. యువతీ యువకులకు ఈరోజు పండుగ రోజు అని తెలిపారు. క్రీడా , రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కావలికి విచ్చేయటం స్టేడియం సందర్శించడం శుభపరిణామం అని తెలిపారు.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో అన్ని శుభశకునాలే అని అన్నారు. మంత్రి డిపిఆర్ తయారు చేయమనడం హర్షణీయమని, క్రీడాకారులతో మాట్లాడి ఏఏ ట్రాక్ లు అవసరమో తెలుసుకొని డిపిఆర్ ప్రిపేర్ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

