సంగం మండలంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పర్యటన

0

 సంగం మండలంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పర్యటన

BSBNEWS - (06.09.2024)



సంగం గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి, కూలీలతో  కలెక్టర్ ఆనంద్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు జిల్లాలో ఒక  లక్ష మందికి ఉపాధి హామీ కింద పనులు కల్పించడమే లక్యంగా ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పంచాయతీల జనరల్ ఫండ్, 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించి జిల్లాలోని మేజర్ పంచాయతీల్లో ఎస్ డబ్ల్యూ పిసి (చెత్త నుండి సంపద తయారీ కేంద్రం) షెడ్లను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టామన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)