టి ఆర్ ఆర్ లో నవయువ కవి సమ్మేళనం

0

టి ఆర్ ఆర్ లో నవయువ కవి సమ్మేళన

BSBNEWS-కందుకూరు

స్థానిక టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ( స్వయం ప్రతిపత్తి) లో బుధవారం విశ్వ సాహితీ కళావేదిక, ఆంధ్రప్రదేశ్, టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో నవయువ కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రఖ్యాత గజల్ గాయకుడు, రచయిత, మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు అందరూ ఉన్నత విలువలు కలిగి ఉండాలని ఉద్భోదించారు. తమ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని, అధ్యాపకుల యొక్క మార్గ నిర్దేశకత్వాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థానాలకి చేరుకోవాలని తెలియజేశారు. తమ జీవితంలోని అనేక విశేషాలని తెలియపరుస్తూ ఉదాహరణల ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. ఎవరైనా సరే ఒక మనిషి జీవించి ఉన్నప్పుడే మంచి సంబంధాల్ని ఏర్పరచుకోవాలని, ఉన్నత మానవతా విలువల్ని కలిగి ఉండే వారిగా తయారు కావాలని విద్యార్థులను కోరారు. తన యొక్క గజల్స్ తో విద్యార్థుల్ని ఉర్రూతలూగించారు. ఒంగోలుకు చెందిన నెక్స్ట్ జెన్ పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ కె మురళీధర్ రెడ్డి, కోగంటి శ్రీకాంత్ మాట్లాడుతూ గజల్ శ్రీనివాస్ తమ గురువుగారని, వారి స్ఫూర్తితోనే తాము తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని తెలియజేశారు. త్వరలోనే ఒంగోలులో ప్రపంచ బాలల తెలుగు మహాసభలు నిర్వహిస్తామని, ఆ కార్యక్రమంలో టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు రచించిన కవితలు వినిపించే అవకాశం ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని సమన్వయ పరిచిన విశ్వసాహితీ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లి రమావతి తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేశారు. తెలుగు భాష అంటే అమ్మ భాషా అని అదే మన ఊపిరి అని తెలిపారు. ప్రముఖ కవి, కళాతపస్వి గంగా డాక్టర్ రంగిశెట్టి రమేష్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు అందరూ కవితల్ని మంచిగా వినిపించారని, అవి ఎంతో సుజనాత్మకంగా ఉన్నాయని తెలియజేశారు. డాక్టర్ రంగిశెట్టి రమేష్ రాసిన కవితల్ని చదివి వినిపించారు. రాష్ట్ర సామాజిక విభాగం అధ్యక్షులు డాక్టర్ బి వి రమణ తమ ప్రసంగం ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రవికుమార్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం తమ కళాశాలలో జరగటం ఎంతో సంతోష దాయకమని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పూనుకున్న తెలుగు విభాగాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు 25 మంది తాము రచించిన కవితల్ని వినిపించారు. ఆ కవితలన్నీ కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొస్తామని ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నిర్వహణ, వ్యాఖ్యాతగా కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ కే .సుజాత, సిహెచ్. అలేఖ్య వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఏడుకొండల నరేంద్ర, డాక్టర్ పి. రాజగోపాల్, డాక్టర్ కె వి పద్మావతి, డాక్టర్ ఐ అనూష, డాక్టర్ ఎన్ .తిరుపతి స్వామి, ఇతర అధ్యాపకులు, విశ్వ సాహితీ కళావేదిక నెల్లూరు జిల్లా కార్యవర్గం, సాహిత్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)