విద్యార్దినిలకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం - కె. ద్వారకా రాణి

0

విద్యార్దినిలకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం -   కె. ద్వారకా రాణి

 BSBNEWS - KANDUKUR [12/9/24] 

కందుకూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకం మెనూ ప్రకారం అమలు చేస్తున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు కె. ద్వారకా రాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతిరోజు మెనూ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరు తెన్నులను పరిశీలిస్తున్నామని అన్నారు. ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరు తెన్నులను పరిశీలిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఆహార పదార్థాలు నాణ్యత ప్రమణాలను కలిగి ఉండాలని భోజన పథకం నిర్వాహకులను సూచనలను, సలహాలను తెలియజేశారు. బియ్యము, కూరగాయలను ఉప్పుతో పలుమార్లు శుభ్రం చేస్తున్నామని ఆమె చెప్పారు. వంటను తయారుచేసే ప్రదేశంలో పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ప్రతిరోజు ఆహార పదార్థాలను భోజనం పథకం నిర్వాహకులు, ఉపాధ్యాయులు రుచి చూస్తారని ఆమె తెలియజేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)