పోలీసు అమరవీరుల సంస్మరణ దినం-2024 ను ఘనంగా నిర్వహించిన జిల్లా యస్పి. జి.కృష్ణకాంత్నె
BSBNEWS - NELLORE
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం-2024 ను జిల్లా యస్పి. జి.కృష్ణకాంత్ నెల్లూరు పోలీసు ప్రధాన కార్యాలయము వద్ద పెరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించి, అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గౌరవ అతిథులుగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఐఏఎస్, జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ ఐఏఎస్, మున్సిపల్ కమీషనర్ యం.సూర్యతేజ ఐఏఎస్, జెడ్ పి చైర్మెన్ ఆనం అరుణమ్మ, ఎం ఎల్ సి బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేయర్ పొట్లూరు స్రవంతి ఇతర ప్రముఖులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధ్యాన్యత అని, అన్ని విధాలా అమరవీరుల కుటుంబ సభ్యులకు తోడ్పాటు అందిస్తామన్నారు. మంత్రి మాట్లాడుతూ వారి కుటుంబం యొక్క అనుబంధం ఎన్నో సంవత్సరాలుగా పోలీసు శాఖతో ముడిపడి ఉందని, మూడవ సారి ఈ సంస్మరణదినోత్సవంలో పాల్గొని దేశ రక్షణలోనూ, అంతర్గత శాంతిభద్రతల పరిరక్షణలోనూ అమరులైన వారి సేవలు కొనియాడడం అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఏ ఆనంద్ మాట్లాడుతూ సమాజానికే పోలీసు వ్యవస్థ వెన్నెముక అని, దేశం లోపల ఉన్న ఇంటర్నల్ టెర్రరిజం, నక్సలిజం, సంఘవిద్రోహ శక్తులను అణచివేయుటలో పోలీసుల పాత్ర కీలకం అని,సమాజ శ్రేయస్సే ఊపిరిగా, ప్రజల శ్రేయస్సు కొరకు మీ ప్రాణాలను పణంగా పెట్టిన యోధులకు, వెలకట్టలేని మీ త్యాగానికి ఇదే మా హృదయాంజలి అని అన్నారు. ప్రజా రక్షణకు పోలీసుల సేవలు స్ఫూర్తిదాయకం అని, అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం అని, అమరులైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శ్రద్దాంజలి అని అన్నారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అంతర్గతంగా దేశంలోపల ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటానికి పోలీసులు రేయింబవళ్ళు విధినిర్వహణలో ఉంటారని అన్నారు. పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది. ఇతర ఉద్యోగుల్లా, కొన్ని గంటలకు మాత్రమే పరిమితమయింది కాదు. ఇరవై నాలుగు గంటల ఉద్యోగం ఒక్క పోలీసు ఉద్యోగమే అని అన్నారు. దేశ అభివృద్ధి కోసం, దేశ సమగ్రత కోసం, అనేక వర్గాలు, రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు పనిచేస్తున్నప్పటికీ ఈ సువిశాల భారతదేశంలో మొత్తానికి ఇద్దరి త్యాగాలను మాత్రం గుర్తుంచుకోవలసిన అవసరం ఉందన్నారు. వారిలో ఒకరు సైనికులు, మరొకరు పోలీసులు అని అన్నారు. 1959వ సంవత్సరం, అక్టోబర్ నెల, 21వ తేదిన హిమాలయాల్లోని లడక్ లోని హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో 15 వేల నుండి 16 వేల అడుగుల ఎత్తులో సాధారణ విధులు నిర్వహిస్తుండగా, భారత భూభాగం లోనికి నిబంధనలకు విరుద్ధముగా, అక్రమముగా ప్రవేశించిన చైనా దళాలు, 10 మంది భారత సి.ఆర్.ఫి.ఎఫ్ జవానులును బలిగొనడంతో వారి వీర మరణానికి చిహ్నంగా ప్రతి సంవత్సరం సంస్మరణ దినం నిర్వహణ. జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం దేశ వ్యాప్తముగా 216 మంది విధి నిర్వహణలో తమ ప్రాణాలను కోల్పోగా వారిలో ఆంధ్రప్రదేశ్ నుండి ఇద్దరు ఉన్నారు అని, వారి యొక్క పేర్లను జిల్లా అడిషనల్ యస్.పి.(AR) గారు అమర వీరుల పేరులను చదివి వినిపించి, శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం స్మృతి పెరేడ్ అద్భుతంగా ఆర్.ఐ(అడ్మిన్) హరిబాబు ఆద్వర్యంలో నెల్లూరు పోలీసులు నిర్వహణ జరిగింది. మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొని, పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు ఉంచి రెండు నిమిషాల మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు. తదుపరి అమరులైన పోలీసు కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్, హుమానిటే కార్పస్ ఫండ్ చెక్కులతో పాటు ప్రత్యేకంగా మెమెంటోలను అందజేసారు. అనంతరం జిల్లా యస్.పి.చేతుల మీదుగ అమరవీరుల సంస్మరణ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, అమర పోలీసు వీరులకు జోహార్లు అంటూ స్లొగన్స్ ఇస్తూ, నినాదాలు చేసినారు. ఈ ర్యాలీలో జిల్లా యస్.పి తో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) సిహెచ్ సౌజన్య, అడిషనల్ యస్.పి.(ఏ ఆర్) శ్రీనివాసరావు, ఎస్ బి. డి ఎస్ పి, సబ్ డివిజన్ పోలీసు అధికారులు, ఏ ఆర్, డి టి సి, హెచ్ జి యూనిట్ డీఎస్పీ లు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఏవో, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఇతర పోలీసు, డిపిఓ అధికారులు, సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు.


.jpeg)
.jpeg)