పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించిన సి.ఐ మంగారావు

0

 పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించిన సి.ఐ మంగారావు


BSBNEWS - GUDLUR

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా మండలంలోని మోచర్ల గ్రామంలో అమరవీరులు లేళ్ల శంకర్, గ్రేహౌండ్ 9వ బెటాలియన్ విగ్రహానికి సిఐ మంగారావు, ఎస్.ఐ వెంకట్రావు లు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐ మంగారావు మాట్లాడుతూ విది నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయక  మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్స్ 9వ బెటాలియన్ కానిస్టేబుల్ లేళ్ళ శంకర్ సేవలు నిలిచిపోతాయని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కై నిరంతరం పనిచేసే ఏకైక వ్యక్తి పోలీస్ అని, అటువంటి పోలీస్ వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరు గుర్తించుకొని వారి త్యాగాలకు ప్రతిఫలంగా శాంతి భద్రతల విషయంలో అందరూ సహకరించాలని ఆయన అన్నారు.  కుటుంబాలను సైతం పక్కనపెట్టి సెలవులు లేకుండా ప్రజల పరిరక్షణకు ఎల్లప్పుడూ పోలీసులు ముందుంటారని ఆయన అన్నారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలను చేసిన పోలీస్ అమరవీరుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. అనంతరం గ్రామంలో ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.


Post a Comment

0Comments
Post a Comment (0)