నలదలపూరు అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం - పరామర్శించిన ఎమ్మెల్యే

0

నలదలపూరు అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం

పరామర్శించిన ఎమ్మెల్యే

BSBNEWS - వలెటివారిపాలెం [14.10.2024]



మండలంలోని నలదలపూరు అడ్డరోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే వలేటివారిపాలెం మండలం పోకూరు గ్రామానికి చెందిన వారు శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో కారు బోల్తా పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు, ఐదుగురు గాయాలు పాలయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు లోని  ప్రభుత్వ ఏరియా వైద్యశాలకి వెళ్లి క్షతగాత్రులు, చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. మృతులు కాలే సామ్రాజ్యం (55),లింగాబత్తిన సులోచన (65)గా గుర్తించారు. అమరావతి. ఉదయశ్రీ లను వెలుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకి తరలించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)