వర్షాలకు ఉప్పుచెరువు నివాసుల ఇక్కట్లు

0
వర్షాలకు ఉప్పుచెరువు నివాసుల ఇక్కట్లు
BSBNEWS - KANDUKUR 


పట్టణంలోని ఉప్పు చెరువు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్లు జలమయమై ఇళ్లల్లోకి మీరు చేరుకోవడంతో ఆ ప్రాంతవాసులు భయాందోళనలో ఉన్నారు. ఉప్పు చెరువులో సిమెంట్ రోడ్లు వేయని ప్రాంతాలలో ఎక్కువ భాగం నీరు నిలబడి నడిచేందుకు వీలు లేకుండా పోయింది. అక్కడ నివసిస్తున్న ఈగల పాటీ హైమావతి ఇంటి దగ్గర రోడ్డుపై వర్షపు నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉప్పుచెరువులో చాలానే ఉన్నాయి. వెంటనే స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చొరవ తీసుకొని  సిమెంట్ రోడ్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టి వర్షాలు పడినప్పుడు ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఉప్పు చెరువు ప్రజలు కోరుతున్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)