హెల్మెట్ ప్రతి ఒక్కరికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

0

 హెల్మెట్ ప్రతి ఒక్కరికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

BSBNEWS - KANDUKUR 


హెల్మెట్ ధరించటం వలన అనుకోకుండా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు తలకు బలమైన గాయం కాకుండా రక్షణ కవచంగా ఉంటుందని కందుకూరు డిఎస్పి బాలసుబ్రమణ్యం అన్నారు. శనివారంపట్టణంలో రోడ్డు ప్రమాదాలు నివారణకై కందుకూరు సిఐ కె. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బైక్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముందుగా పట్టణంలోని డిఎస్పి కార్యాలయం నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్, ఎన్టీఆర్ సర్కిల్, డిపో సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ బొమ్మ విగ్రహం వద్ద ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కందుకూరు డి.ఎస్.పి బాలసుబ్రమణ్యం పాల్గొని మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే మృతిచెందిన వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని దానిని ప్రతి ఒక్కరు ఆలోచించి రోడ్డుపై వాహనాలను నడపాలని ఆయన అన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ పోలీసులు వారికి సహకరించాలని కోరారు. సీఐకే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మైనారిటీ పిల్లలకు వాహనాలు ఇచ్చి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేయవద్దని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వాహనాలకు సంబంధించిన పత్రాలు లేకపోయినా కటిక చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. వాహనాలు నడిపేటప్పుడు అతివేగాన్ని నిరోధిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. యువత రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మరణించడం, అంగవైకల్యానికి గురికావడం జరుగుతుందని, దానికి ప్రధాన కారణం అజాగ్రత్త, నిర్లక్ష్యం ధోరణి అన్నారు.  ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వలన వాహనాలు బ్యాలెన్స్ తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయని వాటిని నివారించాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్ల పై ఉంటుందని ఆయన అన్నారు. ఓక వ్యక్తి యొక్క నిర్లక్ష్యం ఆ వ్యక్తి యొక్క ప్రాణానికేక ఇతరుల ప్రాణాలుకు ముప్పు తీసుకొని వస్తుందని, ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరారు.  నిబంధనలకు విరుద్ధంగా నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వాహనాలు నడిపిన, మద్యం సేవించి వాహనాలు నడపినా జరిమానాలతో పాటు జైలు శిక్షకు బాధ్యులు కాగలరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు పట్టణ ఎస్సై వి సాంబశివయ్య కందుకూర్ రూరల్ ఎస్సై మహేంద్ర నాయక్,  పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)