నష్ట పోయిన రైతుల్ని ఆదుకుంటాం మంత్రి స్వామి
BSBNEWS - PODILI
ప్రకాశం జిల్లా పొదిలి మండలం కొండాయపాలెంలో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, కలెక్టర్ తమీమ్ అన్సారియా లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతన్నలు తీవ్రంగా నష్టపోయారన్నారు. వర్షానికి జొన్న, సజ్జ ఉద్యానవన పంటలు, పొగాకు పంటలు బాగా దెబ్బతిన్నాయన్నారు. జిల్లాలో సుమారు రూ.350 కోట్ల మేర రైతులకు నష్టం జరిగింది అని అన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తామన్నారు. నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని అన్నారు.

