కండక్టర్ కు రక్షణ కల్పించాలి
BSBNEWS - KANDUKUR
ఇటీవల జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ కండక్టర్ సుభాషిణి యాదవ్ పై భౌతిక దాడి జరిగిన విషయం విధితమే. ఆమెకు తగిన రక్షణ కల్పించాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా యాదవ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు మిరియం శ్రీనివాసులు అన్నారు. గురువారం ఆయన కందుకూరులోని కండక్టర్ సుభాషిణి ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుభాషిణి యాదవ్ కు అండగా ఉంటామని అన్నారు. బాధితురాలు నిందితుడు జైలు నుండి బయటకు వస్తే తన ప్రాణానికి హాని ఉందని భయపడుతుందని పోలీసు వారు సుభాషిని యాదవ్ కు రక్షణ కల్పించాలని అన్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యాదవులపై అనుమానస్పద మరణాలు, భౌతిక దాడులు పెరిగిపోయాయని పోలీసు వారు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఉండటమే దీనికి కారణమని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తపరిచారు.

