బదిలీపై వెళ్లిన వెంకట్రావుకు ఆత్మీయ సమావేశం

0

 బదిలీపై వెళ్లిన వెంకట్రావుకు ఆత్మీయ సమావేశం 

BSBNEWS - VALETEVARIPALEM 


మండలంలోని అయ్యవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి బదిలీపై వెళ్లిన అల్లాడి.వెంకట్రావుకి పాఠశాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు ఆధ్వర్యంలో గురువారం ఆత్మీయ వీడ్కోలు సభ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాలలో పనిచేసి బదిలీపై ఒంగోలు దగ్గర ఎర్రజరలో పనిచేస్తున్న వెంకటరావుకి ఆత్మీయ సన్మాన చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భోజన్ తిధి భోజనం ఆ స్పాన్సర్ చేసి పిల్లలందరికీ మంచి రుచికరమైనటువంటి భోజనం అందించడం జరిగిందన్నారు. ఆయన పనిచేసేటువంటి ఎనిమిది సంవత్సరాల కాలంలో పాఠశాల విద్యార్థుల్ని అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, ఉత్తీర్ణ శాతాన్ని పెంచి పాఠశాలలో విద్యార్థులు నమోదు కార్యక్రమాన్ని కూడా ఎక్కువగా చేసినటువంటి వ్యక్తిగా ఆయన ఆ గ్రామానికి చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల సిబ్బంది  గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)