సోషల్‌ మీడియా కార్యకర్తలకు భరోసా ఇచ్చిన బుర్రా

0

సోషల్‌ మీడియా కార్యకర్తలకు భరోసా ఇచ్చిన బుర్రా

BSBNEWS - KANDUKUR 

అక్రమ అరెస్ట్ కు గురైన కందుకూరు నియోజకవర్గ సోషల్ మీడియా కో-కన్వీనర్ అయూబ్ ఖాన్ పఠాన్ ను కలిసి ఆరెస్ట్ కు సంభదించిన విషయాలను  కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ నిర్భంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్‌ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరపున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. అక్రమ నిర్భంధాలకు గురవుతున్న సోషల్‌ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇచ్చి, వారిని పరామర్శించడం జరుగుతుందన్నారు. పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్‌సెల్‌ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు బుర్రా మధుసూదన్ యాదవ్ భరోసా ఇచ్చారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)