ఈనెల 13న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే రైతు ధర్నాను విజయవంతం చేయండి.

0

 ఈనెల 13న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే రైతు ధర్నాను విజయవంతం చేయండి.

అన్నదాతకు అండగా వైఎస్ఆర్సిపి పోస్టర్ ఆవిష్కరణ

కందుకూరు వైఎస్ఆర్సిపి నేతల పిలుపు...

BSBNEWS - కందుకూరు 


రాష్ట్రంలో రైతు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరుతూ అన్నదాతకు అండగా వైయస్ఆర్ సిపి’ పేరుతో రూపొందించిన పోస్టర్ ను కందుకూరు వైఎస్ఆర్సిపి  పార్టీ కార్యాలయంలో నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముప్పవరపు కిషోర్ మాట్లాడుతూ రైతులను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాష్ట్రంలోని రైతులకు అండగా నిలిచేందుకు, ధాన్యం కొనుగోళ్ళు చేసే విధంగా, రైతులకు న్యాయం చేసేందుకు ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్ పిలుపునిచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉంది అని, ఈ ఏడాది అకాల వర్షాలు, వాయగుండాల వల్ల రైతుల పంట దిగుబడి ఇరవై నుంచి ముప్పై బస్తాలకే పరిమితం అయ్యిందన్నారు. చివరికి ఆ ధాన్యంకు కూడా గిట్టుబాటు ధర కల్పించలేని దుర్మార్గమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. దిక్కుతోచక తక్కువ రేటుకే రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు. కనీస మద్దతు ధర అయినా 75 కేజీలకు రూ.1725 రూపాయల ధర ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. తేమ శాతం ఉందని రూ.1300 కొనుగోలు చేస్తున్నారని, ధాన్యం నిల్వ చేసుకునే పరిస్థితి లేక, రోడ్ల మీద ఆర  పోసుకుంటున్నారన్నారు. మళ్ళీ వాయుగుండం అనే వార్తలతో రైతులు భయంతో ఎంతో కొంతకు ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు. అందుకే ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని అన్నారు. కనీసం పదిశాతం కూడా ధాన్యం కొనుగోళ్ళు చేయడం లేదు అని, రైతులను ఆదుకోవడం లేదు అని అన్నారు. దీనికి నిరసనగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు ధర్నా నిర్వహించి, కలెక్టర్ కు వినతిపత్రం అందజేయడం జరుగుతుందన్నారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి అని, గతంలో రైతురుణమాఫీ చేస్తానని నమ్మించి అధికారలోకి వచ్చాడని, తరువాత రుణ మాఫీ చేయలేదన్నారు. వైసిపి ప్రభుత్వం రూ.13,500 రైతుభరోసా ఇస్తే, దానిని అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 రూపాయలు ఇస్తానని నమ్మించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ హామీని అసలు నెరవేరుస్తారో లేదో తెలియడం లేదు అని అన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ లేదు అని, ఈ క్రాప్ అసలే లేదన్నారు. ఈ పరిస్థితిలో రైతుకు అండగా వైయస్ఆర్ సిపి నిలబడుతోంది అని అన్నారు. 13వ తారీకున జరిగే జిల్లా కలెక్టరేట్ ధర్నా కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ నాయకత్వంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)