రైతులకు భూమి హక్కు కల్పించాలి.

0

 రైతులకు భూమి హక్కు కల్పించాలి.

BSBNEWS - సంతమాగులూరు


మండలంలోని కొమ్మలపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామ రెవిన్యూ సదస్సులో కొమ్మలపాడు అగ్రహారం భూములను సాగు చేసుకుంటున్న రైతులకు భూమి హక్కు కల్పించాలని తహశీల్దార్ కు సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగర కొండ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరికీ పట్టాదారు పాస్ బుక్కులు మంజూరు చేయాలని కోరారు. మండలంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అన్నారు. గత ప్రభుత్వంలో రైతులు భూ సమస్యలను అనేక రకాలుగా ఎదుర్కొన్నారని వాటిని పరిష్కరించే దిశగా ఈ రెవెన్యూ సదస్సులు ఉండాలని అలాగని పక్షంలో రైతులందరితో కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  సిపిఐ మండల కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా, కొమ్మలపాడు గ్రామ సర్పంచ్ మహబూబ్ జానీ, కొమ్మలపాడు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)