రైతులకు భూసార పరీక్షా ఫలితాల విశ్లేషణ పత్రాలను అందజేత
BSBNEWS - KANDUKUR
మండలంలోని కోవూరు గ్రామంలో మండల వ్యసాయాధికారి వి.రాము ఆధ్వర్యంలో ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా ఆత్మ ఒంగోలు సౌజన్యం తో రైతులకు భూసార పరీక్షా ఫలితాల విశ్లేషణ పత్రాలను కందుకూరు సహాయ వ్యవసాయ సహాయకులు పి.అనసూయ రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ప్రాజెక్టు ద్వారా కేంద్రీయ విద్యాలయ స్కూల్ కందుకూరు ప్రిన్సిపాల్ అర్జున్ సింగ్ స్కూల్ పిల్లల ద్వారా సోయిల్ స్కూల్ హెల్త్ ప్రోగ్రాం ప్రాజెక్టు ద్వారా మట్టి నమూనాలను సేకరించే పద్ధతి, పరీక్షించే విధానాలను, నేల యెుక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు ఈ కార్యక్రమం వలన సహకరించడం జరిగిందన్నారు. భూసార పరీక్షా ఫలితాలను బట్టి రైతులు వారి భూమిలో భూమి పోషకాలను సవరించుకోవచ్చని, పచ్చిరొట్ట పైర్లు, జీవన ఎరువులు వాడుకోవటం వలన భూసారాన్ని వృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ.వెంకటేష్ మాట్లాడుతూ నేలలో సేంద్రియ కర్భన శాతం పెంచుకోవడానికి పశువుల ఎరువు, వానపాముల ఎరువు, పచ్చిరొట్ట పైర్లు అయిన జనుము, జీలుగ, పిల్లిపేసర వేసుకొని 40రోజులలో పూత వచ్చే ముందు నేలలో కలియ దున్నడం వలన మొక్కలకు పోషకాలు, నేల తేమ శాతం పెరిగుతుందని తెలిపారు. జీవ శిలీంధ్రాలు వృద్ధి చెంది భూమి ఆరోగ్యంగా వుండి, భూసారాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. మండల వ్యవసాయాధికారి వి.రాము మాట్లాడుతూ ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి నేలల సంరక్షణ, కొలవండి, పర్యవేక్షించండి, నిర్వహించండి అని నినాదంతో ప్రపంచ నేల దినోత్సవం జరుపుకొంటున్నామని తెలియజేసారు. కోవూరు గ్రామంలోమొత్తం 40 మట్టి నమూనాలను సేకరించి, రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. రైతులందరూ రబీ సీజన్లో వేసిన పంటలకు మీ సేవా కేంద్రాలలో లేదా సి ఎస్ సి సెంటర్ లో లేదా సచివాలయంలో పంటలకు భీమా చేయించుకోవాలని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ వ్యవసాయ లాబ్ కందుకూరు వ్యవసాయ అధికారిని వి.గీతాప్రకాష్ మాట్లాడుతూ నత్రజని, భాస్వరం, పొటాష్ సూక్ష్మ పోషకాలు యెుక్క ప్రాధాన్యత, ఉపయోగాలు, చౌడు భూములను పరిరక్షించే పద్ధతులు గురించి వివరించారు. తదుపరి సహాయ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ పి. అనసూయ, కేంద్రీయ విద్యాలయం స్కూల్ కందుకూరు విద్యార్థులచే రైతులకు భూసార పరీక్షా విశ్లేషణ పత్రాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మయాంక్, జె.జ్యోతి, శ్రీరంగ, కేంద్రీయ విద్యాలయం స్కూల్ టీ జి టీ టీచర్ కె. పృథ్వీరాజ్, ఆత్మ ఒంగోలు ఎ టీ ఎం. రామి రెడ్డి. కోవూరు గ్రామ వ్యవసాయ సహాయకులు ఎం.నాగరాజు మరియు గ్రామ పెద్దలు నాదెండ్ల వెంకట రమణయ్య, ఎన్. మాధవ, రైతులు తదితరులు పాల్గొన్నారు.



.jpeg)