రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే ఇంటూరి

0

 రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే ఇంటూరి

BSBNEWS - KANDUKUR 

గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 6 వ తేదీ నుంచి జనవరి 8 వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి రెవెన్యూ సదస్సులు జరుగుతాయని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో రీ సర్వే పేరిట ఒకరి భూమి మరొకరికి ఆన్లైన్ చేయటం, రికార్డుల్లో భూమి కొలతల్లో మార్పులు లాంటి పలు సమస్యలుతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం మీయొక్క గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. కందుకూరు నియోజకవర్గంలో రైతులు ఎవరైనా భూ సమస్యలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మీ మీ గ్రామాలలో నిర్వహించు రెవిన్యూ సదస్సుల ద్వారా  భూ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పిస్తే తగు  విచారణ చేసి త్వరితగతిన సమస్యను పరిష్కారం చేస్తారని తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)