రీ సర్వే పేరుతో గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు పాల్పడింది - ఎమ్మెల్యే ఇంటూరి

0

రీ సర్వే పేరుతో గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు పాల్పడింది 

రెవెన్యూ సదస్సులతో.. భూ స‌మ‌స్య‌లకు శాశ్వత పరిష్కారం 

- ఎమ్మెల్యే ఇంటూరి

BSBNEWS - వలేటివారిపాలెం



 రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం జరుగుతుందని కందుకూరు శాసనసభ్యులు  ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం వలేటివారిపాలెం మండలం వలేటివారిపాలెం గ్రామ సచివాలయంలో జరిగే రెవిన్యూ సదస్సులకు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ మీ భూమి- మీ హక్కు డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రీ సర్వే పేరిట ల్యాండ్ మాఫియాకు పాల్పడిందని విమర్శించారు. ప్రజలు భూ సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని నేడు గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 45 రోజుల పాటు జరిగే రెవెన్యూ స‌ద‌స్సులకు ప్రజలు అర్జీ రూపంలో తమ సమస్యలు తెలియజేసి పరిష్కరించుకోవాలని తెలిపారు. ఇకనుంచి భూ సమస్యలపై భాదితులు కార్యాలయాల  చుట్టూ తిరగడం కాకుండా అధికారులే ప్రజల వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సుల నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఫ్రీ హోల్డ్, మ్యుటేషన్, 22ఏ, డీకేటి,  రీ సర్వే, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై వినతులు స్వీకరించి బాధితులకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు. బాధితులు తమ సమస్యలు అర్జీ రూపంలో తెలియజేసి రసీదు పొందాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో ప్రభుత్వానికి ప్రజల నుంచి వచ్చిన  సమస్యలలో ఎక్కువగా రెవెన్యూ శాఖ సంబంధించినవే వచ్చాయని తెలుసుకొని, గత ప్రభుత్వంలో రీ సర్వే పేరిట అన్యాయం జరిగిన బాధితులకు న్యాయం చేయటం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, నియోజకవర్గంలోని రెవెన్యూ అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి భూ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. అధికారులు రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎం.శ్రీనివాసరావు, కె.కుదవాన్, మండల ఎమ్మార్వో హమీద్ ఇతర రెవెన్యూ అధికారులు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకుమాని ఆంజనేయులు, కాకుమాని హర్ష, వలేటి నరసింహం, చెరువుపల్లి మాల్యాద్రి, ఇతర ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)