నా చావుకు కారణం వాళ్ళే అని ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు

0

 

 నా చావుకు కారణం వాళ్ళే అని ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు 

BSBNEWS - GUDLUR 


నా చావుకు కారణం డిప్యూటీ కలెక్టర్ టి.పద్మావతి అని లెటర్ రాసి నక్క వినోద్ కుమార్ అనే రైతు ఉరి వేసుకున్న సంఘటన గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఇటీవల రామాయపట్నం పోర్టు విషయమై అక్కడున్న భూములను రైతుల నుండి ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే నక్కా వినోద్ కుమార్ అనే రైతు సంబంధించిన పొలం విషయంలో రాజకీయం ప్రవేశించింది. ఇటీవల నక్క వినోద్ కుమార్ వైయస్ఆర్సీపీ నుండి టిడిపిలోకి చేరటమే అతని తప్పుగా భావించి అతనికి రావాల్సిన పొలం డబ్బులు డిప్యూటీ కలెక్టర్ టి. పద్మావతి ఆపివేయడం జరిగిందని, దానివల్ల నేను నా కుటుంబం రోడ్డున పడతామని ప్రాధేయపడ్డ కనికరించలేదని వైసీపీ నుండి నువ్వు ఎందుకు టిడిపిలోకి వెళ్ళావని, టీడీపీ నాయకులు నీకు న్యాయం చేస్తారు వెళ్ళు అని చెప్పిందని, నాకు తెలిసిన అందరూ నాయకులు కాడికి నేను వెళ్ళాను అని ఆయన నాకు ఎవరు న్యాయం చేయలేదని దాంతో చేసేది ఏమీ లేక మనస్థాపానికి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారని నక్క వినోద్ కుమార్ సూసైడ్ లెటర్ లో నాకు జరిగినట్టు ఇంకో రైతుకు జరగకూడదని ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరకు చేరేలా అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి అంటూ తన ఫ్రెండ్స్ ని కోరాడు. దాంతో గ్రామస్తులు వెంటనే డిప్యూటీ కలెక్టర్ పై చర్యలు తీసుకొని నక్క వినోద్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు ఆందోళన దిగారు.



Post a Comment

0Comments
Post a Comment (0)