దివ్యాంగులకు అండగా విపిఆర్ ఫౌండేషన్

0

దివ్యాంగులకు అండగా విపిఆర్ ఫౌండేషన్ 

- అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 107 మంది దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ పంపిణి.

- దివ్యాంగుల పెన్షన్ 3 వేల నుంచి 6 వేలుకు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు.

- ప్రజాసేవ చేయడం కోసమే మేం ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాం. 

- పరోపకారం ఆశించని ప్రజాసేవ చేయడమే విపిఆర్ ఫౌండేషన్ లక్ష్యం.

- ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.


BSBNEWS - కొవ్వూరు


సామాజిక సేవా కార్యక్రమాలు చేసేందుకే విపిఆర్ ఫౌండేషన్ స్థాపించామని  ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కోవూరు నియోజకవర్గంలోని 107 మంది నడవలేని దివ్యాంగులకు ఆమె ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ పంపిణి చేశారు. నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డి పాళెం, కొడవలూరు, విడవలూరు, కోవూరు, ఇందుకూరుపేట మండలాలలో నిర్వహించిన కార్యక్రమాలలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పాల్గొని దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ అనేది రాజకీయాలకు అతీతమైన సేవా సంస్థ అన్నారు. తాను రాజకీయాలలో రాక ముందునుంచే విద్యా, వైద్యం, వికాసం, ఆధ్యాత్మిక రంగాలలో వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు. ప్రజాసేవ చేయడం కోసమే పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు తానూ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చామన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు పలువురు దివ్యాంగులు ట్రై సైకిళ్ళు కావాలని కోరారన్నారు. వారి అభ్యర్ధన మేరకు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆగస్టు 15 న 40 మందికి బ్యాటరీతో నడిచే ఎలక్ట్రానిక్ ట్రై సైకిళ్ళు అందచేసినట్లు వివరించారు. అనంతరం ట్రై సైకిళ్ళు కావాలని పలు విజ్ఞప్తులు రావడంతో  కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఓ సర్వే నిర్వహిస్తే బుచ్చిరెడ్డి పాళెం మండలంలో 26 మంది, కోవూరులో 17 మంది, ఇందుకూరుపేటలో 32 మంది, విడవలూరులో 27 మంది, కొడవలూరులో 07 మంది నడవలేక అవస్థలు పడుతున్న 107 మంది దివ్యాంగులను గుర్తించామన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు అందివ్వడం చాలా ఆనందంగా వుందన్నారు. ఇటీవల విపిఆర్ ఫౌండేషన్ చేసే సేవా కార్యక్రమాలలో భాగంగా తిరుపతిలోని స్విమ్స్ వైద్యుల పర్వేక్షణలో కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా 4 వేల 254 మందికి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి ప్రాధమిక దశలో వున్న దాదాపు 667 మందిని గుర్తించి ఉచిత వైద్య సేవలకై తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ కు రెఫర్ చేయడం జరిగిందన్నారు. కోవూరు నియోజకవర్గంలో గత ఇరవై ఏళ్లుగా పూడికలు తీయని సాగునీటి కాలువలలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాగునీటి కాలువలలో పూడిక తీసే పనులు చేపట్టడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభత్వ పధకాలలో సైతం ఎటువంటి వివక్షకు తావు లేకుండా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలు అందేలా కృషి చేస్తున్నామన్నారు. దివ్యాంగుల పెన్షన్ 3 వేల నుంచి 6 వేలకు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కృతజ్ఞతలు తెలియచేసారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో చేయగల సమర్ధత చంద్రబాబు నాయుడుకే వుందని ముఖ్యమంత్రిని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, బుచ్చి టిడిపి అధ్యక్షులు ఎంవి శేషయ్య, అడపాల అనీష్ రెడ్డి, కోవూరు టిడిపి అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, టిడిపి రాష్ట కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య, కొడవలూరు టిడిపి అధ్యక్షులు అమరేంద్ర రెడ్డి, ఇందుకూరుపేట  టిడిపి టిడిపి అధ్యక్షులు వీరేంద్ర నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు నాయకులు బెజవాడ వంశీ రెడ్డి, ముంగమూరు శ్రీహరి రెడ్డి,  కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)