టి. ఆర్. ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధి అవకాశాలు
BSBNEWS - KANDUKUR
స్థానిక టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నైపుణ్య శిక్షణ అంశాలు అను అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అయిన డాక్టర్. వణుకూరి శ్రీనివాసరావు ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ అంశాలకు సంబంధించిన అనేక విషయాలపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శిక్షణ నైపుణ్యాలు ఉపాధి అవకాశాలపై వారు కూలంకషంగా విద్యార్థులతో చర్చించారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ మాధ్యమంగా అందించబడుతున్న వివిధ శిక్షణా కార్యక్రమాలు విద్యార్థులకు భవిష్యత్తులో ఉపయుక్తంగా ఉంటాయని తెలియజేశారు. డిగ్రీ విద్యార్థులు ఫైనలియర్లో ఆరవ సెమిస్టర్ లో చేయవలసిన లాంగ్ టర్మ్ ఇంటర్న్ షిప్ ను వేదికగా చేసుకుని ఎం.ఎస్. ఆఫీస్, జావా, సి ++, మెడికల్ కోడింగ్, మిషన్ లెర్నింగ్ వంటి వివిధ అంశాలలో స్కిల్స్, టెక్నిక్స్ నేర్చుకుని లబ్ధి పొందాలని తెలియ చేశారు.

