పశు గణనను పరిశీలించిన డిడి డాక్టర్ శ్రీధర్ రావు

0

 పశు గణనను పరిశీలించిన డిడి డాక్టర్ శ్రీధర్ రావు

BSBNEWS - LINGASAMUDRAM 

మండలంలోని వి.ఆర్.కోట, అన్నేబోయినపల్లి, చిన్నపవని గ్రామాలలో జరుగుతున్న 21 వ జాతీయ పశుగణనను కందుకూరు పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ శ్రీధర్ రావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగసముద్రం మండలంలో నియమించిన 7 ఏనుమిరేటర్ లు ఫిబ్రవరి 28 లోపు మండలంలో ఉన్న 9506 గృహలలో పశుగనన చేయాలనీ సూచించారు. మండలంలో ఉన్న 35702 గొర్రెలు, 4517 మేకలకు ఉచితంగా పారుడు వ్యాధి నిరోధక టీకాలు డిసెంబర్ 31 లోపు వేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యధికారి వై. శ్రీకాంత్, పశుగణ సహాయకులు సిహెచ్ మహేంద్ర, పశు సంవర్ధక సహాయకులు  జై. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)