దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి - డివైఈవో జానకీ రామ్
BSBNEWS - KANDUKUR
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని కందుకూరు ఉప విద్యాశాఖాధికారి ఎం.వెంకట జానకీ రామ్ సూచించారు. మంగళవారం స్ధానిక భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఎంఈవో కె. సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డిప్యూటి డిఈవో జానకీ రామ్ మాట్లాడుతూ దివ్యాంగులు వికలాంగత్వాన్ని జయించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. మహానీయులను స్ఫూర్తిగా తీసుకుని పట్టుదలతో ముందుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల విద్యాశాఖాధికారి బి.అజయ్ బాబు మాట్లాడుతూ దివ్యాంగులమని నిరుత్సాహపడొద్దని, వికలత్వం అనేది శరీరానికే తప్ప మనస్సుకు, ఆలోచనకు కాదని నిరూపించాలని సూచించారు. సమాజంలో దివ్యాంగుల అందరితో పాటు సమానమేనని, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు దివ్యాంగులకు అండగా ఉంటాయన్నారు. ఎంఈఓ కె. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటుగా భవితా కేంద్రాలను దివ్యాంగ విద్యార్థులు సద్వినియోగం చూసుకోవాలని సూచించారు. దివ్యాంగులు సకలాంగులతో సమానమన్నారు. కందుకూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి.వి సుబ్బారావు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ దివ్యాంగులకు హక్కులు - చట్టాలపై అవగాహన కల్పించారు. దివ్యాంగులు విద్యతో పాటు క్రీడలలోనూ రాణించాలని సూచించారు. అనంతరం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన దివ్యాంగ చిన్నారులందరికీ ముఖ్య అతిథులు చేతుల మీదగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు పి. సంపత్ కుమార్, ఎం మనోహర్, శ్రీధర్, ప్రధానోపాధ్యాయులు ఎం. నరసింహమూర్తి, కె. శ్రీదేవి, ఆర్ వేదవతి, ఐఈడిఎస్ఎస్ ఏసుదాసు, ఐఈఆర్టీలు కూనం ఉదయలక్ష్మీ, ఆర్ కోటేశ్వరరావు, సిఆర్పీలు ఎం. వెంకట రమణారెడ్డి, శ్రీనివాసరావు, ప్రతిభ, ఎంఆర్సీ సిబ్బంది కీర్తీ, రాగమ్మ, శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, దివ్యాంగ విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.



