మోటారు వాహనాల దొంగ అరెస్టు

0

మోటారు వాహనాల దొంగ అరెస్టు

BSBNEWS - కందుకూరు



పట్టణంలో మోటార్ వాహనాలను దొంగలిస్తున్న వ్యక్తిని తన సిబ్బందితో అరెస్టు చేయడం జరిగిందని పట్టణ ఎస్.ఐ వి.సాంబశివయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పట్టణంలోని అంకమ్మ గుడి సమీపాన మెడికల్ షాపు వద్ద ఉంచిన AP39QB8100 నెంబర్ గల హెచ్.ఎఫ్ డీలక్స్ హీరో మోటార్ సైకిల్ అపహరణకు గురైనది అని కందుకూరు పట్టణానికి చెందిన పాశం నవీన్ అనే అతని ఫిర్యాదు మేరకు కందుకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయటం జరిగింది అన్నారు. ఆ కేసు విషయంలో విచారణ చేస్తుండగా ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన గుంటక మాల్యాద్రి తండ్రి చిన్న మాల కొండయ్య అను వ్యక్తి మోటర్ వాహనాల దొంగగా తన విచారణలో తేలిందని ఆయన తెలిపారు. దాంతో తన సిబ్బందితో గుంటక మాల్యాద్రిను తన ఇంటి దగ్గర అరెస్ట్ చేసి అతని వద్ద నుండి సదరు పాశం నవీన్ కు సంబంధించిన మోటార్ బైక్ తో పాటు, కందుకూరు, పొన్నలూరు, హైదరాబాద్, భీమవరం తదితర ప్రాంతాల్లో దొంగలించిన మరో ఐదు బైకులను మొత్తం సుమారు రెండున్నర లక్షల రూపాయలు విలువగల ఆరు మోటార్ బైకులు అతని నుండి స్వాధీన పంచుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం గుంటక మాల్యాద్రిని రిమాండ్ నిమిత్తం కందుకూరు కోర్ట్ జడ్జి  ముందు హాజరు పరిచామని ఆయన అన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)