అణగారిన వర్గాల గుండె దివ్వెలు వెలిగించిన భానుడు అంబేద్కర్
-మంత్రి పొంగూరు నారాయణ
BSBNEWS - NELLORE
అణగారిన వర్గాల గుండె దివ్వెలు వెలిగించిన భానుడు అంబేద్కర్ అని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఏసీ నగర్ లోని బి జి కే సి కళ్యాణ మండపంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ పోరాటమంతా బహుజనుల రాజ్యాధికారం దిశగానే సాగిందన్నారు. అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని, ఆయన ఆశయాల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలపై నీళ్ళు చల్లాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ పోరాటపటిమను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

