మెప్మా ఆధ్వర్యంలో ప్రపంచ విభిన్న ప్రతిభవాంతుల దినోత్సవం
BSBNEWS - KANDUKUR
కందుకూరు మున్సిపాలిటీ లోని మెప్మా విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ విభిన్న ప్రతిభవాంతుల దినోత్సవ కార్యక్రమం మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభా వంతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించి వారిని గౌరవంగా సన్మానించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమీషనర్ కె.అనూష మాట్లాడుతూ వికలత్వం మనిషి శరీరానికే తప్ప మనసుకు కాదని ఎవరు అధైర్య పడకుండా ముందుకు సాగాలని ఆమె అన్నారు. మెప్మా ద్వారా అందించే పథకాలను సక్రమంగా వినియోగించుకొని తమకున్న వికలత్వాన్ని తరిమి కొట్టి ఎవరికీ మేము తీసుకోమన్న విధంగా మీరు ఎంచుకున్న మార్గంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని ధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ వై.సంపత్ కుమార్, వి.హెచ్.పి.ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు గోచిపాతల. కోటి, మెప్మా సి ఓ లు మాధవి లత, సురత్న, మెప్మా ఆర్పీలు, విభిన్న ప్రతిభవాంతులు తదితరులు పాల్గొన్నారు.



.jpeg)