కందుకూరు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
BSBNEWS - KANDUKUR
పట్టణంలోని కోవూరు రోడ్డు వద్ద ఉన్న స్వర్ణ స్వయంక్రృషి మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో కందుకూరు వాసవి క్లబ్ లెజెండ్స్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈసందర్భంగా వాసవి క్లబ్ లెజెండ్స్ ప్రెసిడెంట్ రవ్వా శ్రీనివాసులు సాహకారంతో పాఠశాలలో ఉన్న దివ్యాంగులకు వాటర్ బాటిల్స్ తో పాటు సాయంత్రం అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కందుకూరు వాసవి క్లబ్ లెజెండ్స్ ప్రెసిడెంట్ సేవా హ్రుదయ డాక్టర్ రవ్వా శ్రీనివాసులు(ఎల్ ఐ సి ఏజెంట్) మాట్లాడుతూ దివ్యాంగులను ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఆదరించాలని వికలాంగులత్వం వారి శరీరానికే గాని వారి మనసుకు కాదని అన్నారు. ప్రతి ఒక్క దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు వాసవి క్లబ్ లెజెండ్స్ ట్రెజరర్ చీధెళ్ళ క్రృష్ణ, (మణికంఠ గార్మెంట్స్) తదితరులు పాల్గొన్నారు.

