అరవింద్ కేజ్రివాల్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి - నేతి మహేశ్వర రావు

0

అరవింద్ కేజ్రివాల్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి - నేతి మహేశ్వర రావు

BSBNEWS - KANDUKUR 


 ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్ పై జరిగిన దాడికి నిరసనగా స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర భారత రాజ్యాంగాన్ని బిజెపి గుండాల నుంచి కాపాడాలని ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉచిత విద్య ఉచిత వైద్యం సురక్షిత నీరు అప్పులు లేని పరిపాలన అవినీతి రహిత పరిపాలన ఎలా ఉంటుందో దేశ ప్రజలకు ఒక ఆదర్శంగా నిలిచిన పరిస్థితి ఉందని గుర్తు చేశారు. ఢిల్లీ శాంతిభద్రతలను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకోవడం ముఖ్యంగా గవర్నర్ పెత్తనంతో ఢిల్లీ గ్యాంగ్ స్టర్ లకు నిలయంగా మారిపోవడం దురదృష్టకరం అని ఆయన అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తాలూకా ప్రచారంలో భాగంగా ప్రజలను కలుస్తున్న అరవింద్ కేజ్రీవాల్ మీద మూడవ సారి బిజెపి గుండాలతో దాడి చేయించడం అంటే ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బిజెపి భయపడుతుంది అని అన్నారు. ఈ దేశంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, అవినీతి లేని జవాబుదారుతనంతో కూడిన పరిపాలన అందిస్తున్న ఢిల్లీని గెలవలేకనే బిజెపి ఇలాంటి దాడులకు తెగబడుతుంది అని అన్నారు. ఈ దేశంలో మతం ఆధారంగా, అదానీ లాంటి ఆర్థిక మాఫియా అండతో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కబళిస్తున్న బిజెపిని నిలువరించగలిగిన శక్తి సామాన్యులతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికిని దేశంలో లేకుండా చేయడానికే అరవింద్ కేజ్రీవాల్ ని భౌతికంగా లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతుంది అని ఆయన ఆరోపించారు.ఇప్పటికైనా రాష్ట్రపతి జోక్యం చేసుకొని ఢిల్లీ శాంతిభద్రతులను ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు ఉండేలా చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది అని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుకున్నది అని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ మీద దాడి చేసిన గుండాలను ఆ గుండాల వెనుకనున్న గ్యాంగ్ స్టర్ లను బీజేపీ పెద్దలను విచారించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, సామాజికవేత్త పాలేటి కోటేశ్వరరావు బి వెంకటేశ్వర్లు, రేణమాల అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)