నారువేతలలో కూలీలకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం ఇవ్వాలి
BSBNEWS - VALETIVARIPALEM
నారువేతలలో వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా జీవో నెంబర్ 73ను అమలు పరుస్తూ ఎకరాకు ₹7,000 లు మగత చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వలేటివారిపాలెం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ రసూల్ కి సోమవారం నాడు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దార్ల మాధవరావు మాట్లాడుతూ కార్మిక శాఖ ఇచ్చిన జీవో 73 ప్రకారం కనీస కూలి చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల గ్రామాలలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఎక్కువ గ్రామాలలో కనీస కూలీ 250, కొద్ది గ్రామాలలో 300 ఇస్తున్నారని తెలిపారు. నారువేతలలో కాంట్రాక్టు పద్ధతి రావడంతో 12 గంటలు పని చేయవలసి వస్తుందని, శ్రమకు తగ్గ కూలి రావడంలేదని పేర్కొన్నారు. రోజంతా పనిచేసిన 3 నుండి 4 వేలు మాత్రమే వస్తుందని అన్నారు. దీనివల్ల శ్రమ దోపిడీ గురి అవుతున్నారని తెలిపారు.కేంద్ర కార్మిక శాఖ ప్రతి ఆరు నెలలకు విడుదల చేస్తున్న జీవో 73 ను అమలు చేయాలని కోరారు. మన కందుకూరు ప్రాంతంలో ఈ జీవో ఎక్కడ అమలు కావట్లేదని తెలిపారు. ఏ పనికి ఎంత ఇవ్వాలో ఈ జీవో తెలుపుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నారువేతలు కలుపులు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ జీవో అమలయ్యే విధంగా చూడాలని కోరారు. లేనట్లయితే కూలీలందరిని సమీకరించి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో దార్ల మాధవరావు తో పాటు జీవి బి కుమార్, వద్దిముక్కల సురేష్ తదితరులు ఉన్నారు

