మార్చి 18న విద్యుత్ డిఈ కార్యాలయం వద్ద నిరసన
BSBNEWS - KANDUKUR
ఈనెల 18వ తేదీ మంగళవారం కందుకూరు పట్టణంలోని విద్యుత్ డిఈ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. స్థానిక కోటారెడ్డి భవనంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తీసుకువచ్చి మాకు ఉపాధి లేకుండా చేస్తుందని వారు తెలిపారు. రీడర్స్ గా ఇంతకాలం సేవ చేసిన మాకు సంబంధిత విద్యుత్ కార్యాలయంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని లేనియెడల మా పోరాటం ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. మా సమస్యల పై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము పలుమార్లు మా న్యాయమైన కోరికను తీర్చటంలో ప్రభుత్వం వెనకంజ వేయటం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు. ఏప్రిల్ 1.వ తేదీన విజయవాడలో సమ్మెబాట పడుతున్నామని అప్పటివరకు విడతల వారీగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేము కోరిన న్యాయమైన డిమాండ్లను పునరాలోచించి పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి వై.ఆనందమోహన్, ఏఐటీయూసీ అనుబంధ ఏపీ విద్యుత్ మీటర్స్ రీడర్స్ యూనియన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాల్యాద్రి, కందుకూరు పట్టణ కోశాధికారి జే రాము, రీడర్స్ యూనియన్ సభ్యులు ఏ.నరేష్, డి. సురేష్ లు పాల్గొన్నారు.

