మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రేమ వివాహం

0

మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రేమ వివాహం 

BSBNEWS - KANDUKUR 

కందుకూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రేమ వివాహం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య నాయకులు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లోని నల్ల రెడ్డి పల్లి గ్రామానికి చెందిన కాలనీడి మాల్యాద్రి చెన్నమ్మ ల పెద్ద కుమారుడు కొలనీడి మదన్ గోపాల్ కందుకూరు పట్టణానికి చెందిన బండ్లమూడి అరుణ మాలకొండయ్య ప్రధమ పుత్రిక బండ్లమూడి వైశాలి లో గత సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నారని మా దృష్టికి రావడం జరిగిందని. దాంతో ఇరువురి పెద్దలను పిలిచి వారి సమక్షంలో సిపిఐ కార్యాలయంలో సామాజిక వివాహం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఏఐటీయూసీ కార్యదర్శి వై.  ఆనంద్ మోహన్, ప్రకాశం జిల్లా కనిగిరి మండలం సిపిఐ కార్యదర్శి జి పి రామారావు, కమ్మవారిపాలెం ఉపాధ్యాయులు మాలకొండయ్య, జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల ఉపాధ్యా యులు నాగేశ్వరరావు, ఏపీ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మెండ శైలజ, ప్రధాన కార్యదర్శి ఓలేటి కల్పన, కోశాధికారి కారం శెట్టి ఇంద్రాణి, ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు దుర్గాప్రసాద్ ఇరువురి పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0Comments
Post a Comment (0)