మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించిన సీఐ వెంకటేశ్వరరావు
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని పెద్ద బజారు నందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పబ్బిశెట్టి వరదరాజ, నల్లమల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బోణాల శ్రీనివాస చక్రవర్తి వారి తండ్రి చెంచు కిష్టయ్య జ్ఞాపకార్థం బోణాల శ్రీనివాస చక్రవర్తి వారి కుటుంబ సభ్యులు మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ మంచినీటి చలివేంద్రాన్ని సీఐ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. అక్కడ విచ్చేసిన వారికి సీఐ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చడం ఓ మంచి కార్యక్రమమని అన్నారు. శ్రీనివాస చక్రవర్తి కుటుంబ సభ్యులను సిఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

