ఆకతాయిలను ప్రమాదం నుండి కాపాడిన సీఐ

0

ఆకతాయిలను ప్రమాదం నుండి కాపాడిన సీఐ

తాగి వాహనాలు నడపకండ్రా బాబూ..

BSBNEWS - కందుకూరు 

పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో గురువారం సిఐ వెంకటేశ్వరరావు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తుండగా ముగ్గురు యువకులు మద్యం సేవించి అతివేగంతో  పెడుతూ ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేశారు. అంతలోనే అటుగా వెళుతున్న లారీ కింద పడబోయారు. అది గమనించిన సిఐ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళని కాపాడారు. అయితే ప్రాణాలు దక్కించుకున్న ఆయువకులు, పబ్లిక్ చూస్తుండగానే పోలీసులపై రివర్స్ అయ్యారు. మాకు ఏదైనా జరిగితే ఏంటి అని తాగిన మత్తులో వాదిస్తుంటే అందరిని ఆశ్చర్యపరిచింది. అసలే మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, పైగా మత్తులో హంగామా చేయడం. ఇలా ఉంది కొంతమంది ఆకతాయిల పరిస్థితి. సీఐ వెంకటేశ్వరరావు మద్యం సేవించి వాహనాలు నడిపి జీవితాల్ని పాడు చేసుకోవద్దు అని, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని బాధ పెట్టొద్దు అని ఆకతాయిలకు అవగాహన కల్పించారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)