వక్ఫ్ బోర్డ్ బిల్లు ఉపసంహరించకోవాలి
- సిపిఐ డిమాండ్
BSBNEWS - కందుకూరు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డ్ ను ఉపసంహరించు కోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. కందుకూరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి బి సురేష్ బాబు ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డ్ బిల్లును ఉపసంహరించుకోవాలని పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను, క్రైస్తవులను ఇబ్బందులకు గురి చేసే విధంగా, వారి హక్కులను కాలరాసే విధంగా చట్టాలు తీసుకువస్తుందని బిజెపి ప్రభుత్వం చేసిన ప్రతి చట్టానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని వారు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వెంటనే వాక్ బోర్డ్ బిల్లుకు వ్యతిరేకించాలని లేనియెడల కార్యాచరణ రూపొందించుకొని పోరాటం చేస్తామన్నారు. ముస్లింలకు హాని కలిగించే విధంగా బిజెపి ప్రభుత్వం వివిధ రకాలుగా ప్రయత్నాలు చేయటం సమంజసం కాదని ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొని రావటం వారి పతనానికి నాంది అని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి యర్రంశెట్టి ఆనందమోహన్, సిపిఐ నాయకులు ఉప్పుటూరి మాధవరావు, బొల్లోజుల బాల బ్రాహ్మచారి, ద్రోణాదుల ఆదినారాయణ, కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కోశాధికారి ఇంద్రజ, న్యాయవాది ముప్పవరపు కిషోర్, జిలాని తదితరులు పాల్గొన్నారు.

