పెండ్లి కుమార్తెను ఆశీర్వదించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని తానికొండవారిపాలెం నకు చెందిన మర్రిపూడి సింగయ్య కుమార్తె హారిక చౌదరి వివాహం సందర్భంగా మంగళవారం ఇంటి వద్ద జరిగిన నలుగు కార్యక్రమానికి హాజరై హారిక చౌదరిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన భాగస్వామితో నూతన జీవితాన్ని సాగించుటకు అడుగుపెడుతున్న నవ వధూవరులు వారి జీవితాన్ని సుఖశాంతులతో సాగించాలని అన్నారు.

