కార్మికులను వీధుల పాలు చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి.

0

కార్మికులను వీధుల పాలు చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 

నిరసన ర్యాలీలో సిఐటియు డిమాండ్

BSBNEWS - KANDUKUR  

కేంద్ర ప్రభుత్వం విధించిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అంకమ్మ దేవాలయం దగ్గర నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు జరిగింది. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసి, 4 లేబర్ కోడ్లను విధించి, కార్మికులను వీధులు పాలు చేసిందని, వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1886 లో కార్మికుల ప్రాణత్యాగంతో సాధించుకున్న 8 గంటల పనికి నేడు విఘాతం కలుగుతుందని, కార్పొరేట్ యజమానులు, సాఫ్ట్వేర్ యజమానులు 8 గంటలు కాదు, రోజుకు 14 గంటలు పని చేయాలంటే, మోడీ ప్రభుత్వం వాళ్లకి మోకరిల్లి, కార్మికులను నట్టేటముంచుతుందని ఎద్దేవచేసారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు విరమించుకోకపోతే జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా కోట్లాదిమందితో సమ్మె చేసి నిరసన వ్యక్తం చేస్తామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులుఎస్ ఎ గౌ స్, జీవివి కుమార్, గుడ్లూరు మండల కార్యదర్శి, కొట్టే వెంకయ్య, ఉలవపాడు మండల కార్యదర్శి ఎస్ డి గౌస్ బాషా, డివైఎఫ్ఐ గుడ్లూరు మండల కార్యదర్శి గుత్తి మల్లికార్జున, ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు సుంకర విజయలక్ష్మి, అంగన్వాడి ఉలవపాడు ప్రాజెక్టు లీడర్ సిహెచ్ ఇందిరావతి, కందుకూరు లీడర్ ప్రభావతి, సీఐటియు నాయకులు ఎస్.పవన్ కుమార్, ఎన్ తిరుపాల్, గుడ్లూరు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు చేవూరు సైమాన్, బెల్లంకొండ నారాయణ, రైతు సంఘం నాయకులు, దామా కృష్ణయ్య, డి.ఎం.రాయుడు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)