మున్సిపల్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

0

మున్సిపల్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

BSBNEWS - కందుకూరు 

స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను మున్సిపల్ కమిషనర్ కే అనుష ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కె.అనూష మాట్లాడుతూ జీవో ఎంఎస్ నెంబర్ 54 ప్రకారం ప్రతి సంవత్సరం మే 28వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు. అందులో భాగంగా బుధవారం ఎన్టీఆర్ జయంతి వేడుకలను బుధవారం నిర్వహించడం జరిగిందన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)