రక్తదానం చేసిన కందుకూరు పట్టణ యువకులు

0

రక్తదానం చేసిన కందుకూరు పట్టణ యువకులు 

BSBNEWS - కందుకూరు 

ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్ నందు ఒక పేషెంట్ కి హార్ట్ సర్జరీ నిమిత్తం అరుదు గ్రూపు అయిన A-ve రక్తం అవసరం అయ్యి ఆ రక్తం దొరకక గత కొన్ని రోజుల నుండి ఆపరేషన్ వాయిదా పడుతూ వస్తూ ఉన్నవిషయం తెలుసుకున్న బ్లడ్ డోనర్స్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు అయిన కందుకూరు పట్టణం ఐ.యస్ రావు నగర్ కి చెందిన మిరియాల వెంకట నరేష్ బాబు, సాయి క్రిష్ణ నగర్ కి చెందిన కంపరాజు అచ్యుత రామరాజు  వెంటనే స్పందించి కందుకూరు నుండి ఒంగోలు వెళ్లి రక్తదానం చేసి రావడం జరిగింది. చాలా అరుదు రక్త గ్రూపు కలిగి ఉన్న మిరియాల వెంకట నరేష్ బాబు, కంపరాజు అచ్యుత రామరాజు  లు గతంలో కూడా అనేక సార్లు తమ అరుదైన రక్తం ను దానం చేసి ఆపదలో ఉన్న చాలా మంది పేషెంట్ల ప్రాణాలు కాపాడారు. సరైన సమయానికి వచ్చి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన నరేష్ బాబు, రామరాజులకు పేషెంట్ తరపు బంధువులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కందుకూరు రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ చైర్మన్ చన్నా వెంకట రామాంజనేయులు మాట్లాడుతూ వెంకట నరేష్,రామరాజు ఆపద సమయంలో వెంటనే స్పందించి ఒంగోలు వెళ్లి రక్తదానం చేయటం అభినందనీయం మరియు స్పూర్తి దాయకం అని అభినందించారు. ఆరోగ్యవంతమైన యువత ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానాన్ని అలవాటుగా చేసుకోవాలని ఆకాంక్షించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)