నెల్లూరు జిల్లా మహానాడు లో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు.

0

నెల్లూరు జిల్లా మహానాడు లో కందుకూరు శాసనసభ్యులు  ఇంటూరి నాగేశ్వరరావు.

BSBNEWS - కందుకూరు  

నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్  ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరు పార్లమెంట్ మినీ మహానాడు  జరగగా రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా  శాసనసభ్యులు ప్రజా ప్రతినిధులతో కలిసి కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు  ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గం బాగా వెనుకబడిన ప్రాంతమని,  నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడులో నియోజకవర్గంలోని 7 ప్రధాన సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం జిల్లాలను అస్తవ్యస్తంగా విభజించి, కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లా నుండి నెల్లూరు జిల్లాలో కలిపి ప్రజలకు తీవ్ర అన్యాయం చేసింది. కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నానని ఎమ్మెల్యే తెలిపారు. రాళ్లపాడు ప్రాజెక్టు ఎడమ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, సోమశిల ఉత్తర కాలువ ద్వారా 1.5 టీఎంసీ నీటిని తీసుకురావాలని ఆయన ప్రతిపాదించారు. "ఈ పనులు పూర్తయితే వందల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది, అనేక గ్రామాలకు తాగునీరు అందుతుందని  పేర్కొన్నారు.పాలేరు, మన్నేరు నదులపై చెక్ డ్యామ్‌ల నిర్మాణం ద్వారా సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించవచ్చని, ఉలవపాడు మండలంలో మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మ్యాంగో మార్కెట్, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అలాగే, కందుకూరు పట్టణంలో ప్రధాన ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి నార్త్ బైపాస్ రోడ్డు,  ప్రముఖ పుణ్యక్షేత్రమైన మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలు రెండవ ఘాట్ రోడ్డు నిర్మాణం, మెట్ట ప్రాంతమైన కందుకూరు నియోజకవర్గానికి వెలుగొండ ప్రాజెక్టు జలాలను  తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని ఇంటూరి నాగేశ్వరరావు  ప్రతిపాదించారు. ఈ ప్రధానమైన సమస్యలను పరిష్కరిస్తే కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఎమ్మెల్యే  ఇంటూరి నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన పై ప్రతిపాదనలను పార్లమెంటరీ పార్టీ జిల్లా మినీ మహానాడు వేదికగా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. పై తీర్మానాలను కడపలో జరిగే పార్టీ మహానాడులో  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  దృష్టికి తీసుకెళ్తామని పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు  షేక్ అబ్దుల్ అజీజ్  తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర, పార్లమెంటు, నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు..

Post a Comment

0Comments
Post a Comment (0)