మహిళల పట్ల అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడితే ఊరుకునేది లేదు
మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రాయపాటి శైలజ
BSBNEWS - మంగళగిరి
మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్మన్ గా రాయపాటి శైలజ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నమ్మకంతో, బరువైన బాధ్యతను అప్పజెపినందుకు బాధ్యతగా విధులు నిర్వహిస్తానన్నారు. మహిళ హక్కులు, సంక్షేమ సాధనకు తోడ్పడతూ మహిళల రక్షణ కోసం పాడుపడతానన్నారు. గత 5 ఏళ్లలో మహిళ కమిషన్ తూతుమంత్రంగా వ్యవహరించింది అని అన్నారు. రాష్ట్రంలోని మహిళలకు తోడుగా నిలబడతానని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా, అందరికి న్యాయం చేస్తాన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అని తెలిపారు. ప్రతి ఒక్కరూ మహిళలకు గౌరవం తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. సోషల్ మీడియాను ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ, అడవారిపై తప్పుగా పోస్ట్ లు పెడుతున్నారు అని వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై మహిళల పట్ల అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడితే ఊరుకునేది లేదు అని, అటువంటి వారిపై చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామన్నారు.

