ఆంధ్రకేసరికి ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు

0

 ఆంధ్రకేసరికి ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు

BSBNEWS - KANDUKUR

ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా పలువురు పుర ప్రముఖులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. స్థానిక కోవూరురోడ్దు ప్రకాశం సర్కిల్ లో ఆంధ్ర కేసరి సేవా సమితి సభ్యులచే ప్రతిష్ఠించ బడిన నిలువెత్తు విగ్రహానికి సేవాసమితి బాద్యులు పూల మాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులు ఆంధ్ర జాతికి దేశానికి చేసిన సేవలను కొని యాడారు. ఈ కార్యక్రమానికి నందనవనం రామ సుబ్బారావు, డాక్టర్ తన్నీరు మల్లిఖార్జునరావు, నారాయణం రాధాకృష్ణమాచార్యులు, పెట్లూరి సుబ్బారావు, చెక్కా వెంకట కేశవరావు, కే.ఎస్.వెంకటేశ్వర్లు, రావులకొల్లు వెంకటేశ్వర్లు(ఆర్.వి.), రావులకొల్లు బ్రహ్మానందం, ఏ.వి.రావు, పిన్నమరాజు సురేష్, గాదిరాజు నాగరాజు,  బి.జె.పి.వరప్రసాదరావు, శ్రీనివాసదీక్షితులు, జీ.వి.శేషగిరిరావు, వాకాణి శేషాచార్యులు, కాకర్ల రాజగోపాల్, గణపతిరాజు వాసుదేవరావు, సామాను బ్రహ్మయ్య, తదితరులు హాజరయ్యారు.

Post a Comment

0Comments
Post a Comment (0)