కందుకూరులో ఆపరేషన్ సింధు ర్యాలీ విజయవంతం
వీర జవాన్ మురళి నాయక్ నివాళులు అర్పించిన కూటమి నేతలు
200 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే ఇంటూరి
BSBNEWS - KANDUKUR
కందుకూరు పట్టణం శనివారం జాతీయ పతాకాలతో కలకలలాడింది. ఆపరేషన్ సింధు విజయవంతం కు మద్దతుగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆక్స్ఫర్డ్ విద్యార్థులు రెండు వందల మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పోస్ట్ ఆఫీస్ మీదుగా ఆర్డీవో ఆఫీస్ వరకు జరిగింది. ఆర్డీవో ఆఫీస్ లో వీర జవాన్ మురళి నాయక చిత్రపటానికి పూలమాలలు వేసి కూటమి నేతలు నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ పహల్గాన్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతిఘటనగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఆపరేషన్ సింధుని మన దేశ సైనికులు విజయవంతంగా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. ఇకపై మన దేశం వైపు ఇతర దేశాల ఉగ్రవాదులు ఎవరైనా చూడాలంటే భయం పుట్టేలా మన సైనికులు ప్రదర్శించిన ఆపరేషన్ సింధు విజయవంతానికి మద్దతుగా వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జనసేన నాయకులు విద్యార్థులు పలువురు నాయకులు పాల్గొన్నారు.