కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి అధినేత ప్రాధాన్యతనిస్తారు - బుర్రా మధుసూదన్ యాదవ్

0

కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి అధినేత ప్రాధాన్యతనిస్తారు  

-బుర్రా మధుసూదన్ యాదవ్ 

BSBNEWS - KANDUKUR 


కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి అధినేత ప్రాధాన్యతనిస్తారు   - బుర్రా మధుసూదన్ యాదవ్       వైస్సార్సీపీ రాష్ట్ర మునిసిపల్  వింగ్ జాయింట్ సెక్రటరీగా దాసరి.మాల్యాద్రి  నియామకం   పార్టీకి శుభ పరిణామం అని  మాజీ శాసనసభ్యులు కందుకూరు వైస్సార్సీపీ ఇంచార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. స్థానిక పామూరురోడ్ లోని వైసిపి పార్టీ కార్యాలయంకు విచ్చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్  మాట్లాడుతూ కష్టించి పని చేసే ప్రతి ఒక్కరిని పార్టీ అధినేత జగన్ గుండెల్లో పెట్టి చూసుకుంటారని అన్నారు. దేశం కోసం అమరుడైన మురళి నాయక్ పట్ల జగన్ బాధ్యతగా వ్యవహరించిన తీరు నిదర్శనం అని అన్నారు. భారత్-పాకిస్తాన్ యుద్దంలో అమరుడైన మురళీనాయక్‌ త్యాగాన్ని స్మరించుకుంటూ  ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  యుద్ధంలో ముర‌ళీ నాయ‌క్ చూపించిన తెగువ, ఆయ‌న త్యాగం దేశంలోని ప్ర‌తి పౌరునికీ స్ఫూర్తినిస్తుంద‌ని అన్నారు. ఈనెల 13న వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లి ముర‌ళీ నాయ‌క్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించనున్నారు అని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ వింగ్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన దాసరి మాల్యాద్రిని దృశ్యాలువతో సత్కరించారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా జనరల్ సెక్రెటరీ తోకల కొండయ్య, జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్, రాష్ట్ర బూత్ కమిటీ జాయింట్ సెక్రెటరీ గణేశం గంగిరెడ్డి, జిల్లా సెక్రెటరీ చీమల వెంకటరాజా, జిల్లా ఉపాధ్యక్షులు బిల్లా రమణయ్య, కందుకూరు మండల అధ్యక్షులు ఈదర రమేష్, ఐటీ వింగ్ అధ్యక్షులు అమరనాథరెడ్డి, గ్రీవెన్స్ వింగ్ అధ్యక్షులు ఎరమాల నాగభూషణం, నాయకులు తలపనేని గోపి, ఎడ్ల మాధవరెడ్డి, షేక్ రహీమ్, వెంకట్రావు, కాపులూరి మధు, అప్పనబోయిన రాజేష్, షేక్ అబ్దుల్ కలాం, బి.జయరావు, శ్రీరామ కుమారస్వామి, మదన్మోహన్, బాబు,సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)