ఓగూరులో కిషోరి వికాసం
BSNEWS - కందుకూరు
మండలంలోని ఓగూరు ఆది ఆంధ్ర కాలనిలో కిషోరి వికాసం కార్యక్రమం సూపెర్వైసోర్ యు.ప్రభావతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీడీపీఓ శర్మిష్ట ఆదేశానుసరం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. సమాజంలో బాలికలకు ఎదురయ్యే సమస్యల గురించి వారికి వివరించడం జరిగిందన్నారు. ప్రతి ఒకరు జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సమస్యలకు భయపడి వేయకూడదని ఆమె తెలిపారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం తీసుకోవడం వలన బలంగా తయారవుతారని శరీరంలో వచ్చే సమస్యలను కూడా ఎదుర్కోవచ్చని ఆమె తెలిపారు. తల్లిదండ్రుల సైతం పిల్లలకు మనోధైర్యాన్ని కల్పించి వారిని ముందుకు నడిపించేలా ప్రయత్నం చేయాలని ఆమె అన్నారు. లింగ వివక్ష గురుంచి, అక్రమ రవాణా గురుంచి 11 నుండి 18 సంవత్సరాల వయసు గల బాలికలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తల్లులు, బాలికలు తదితరులు పాల్గొన్నారు.

