గొట్టిపాటి కిచెన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - kandukur
కందుకూరు మండలం ఓగూరు సమీపంలో జాతీయ రహదారి పక్కన కొత్తగా ఏర్పాటు చేసిన గొట్టిపాటి కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. కందుకూరు ప్రాంతంలో సరికొత్తగా, రెస్టారెంట్ లో ఫుడ్ సప్లై కోసం రోబోను ఏర్పాటు చేయగా, రోబో పనితీరును ఎమ్మెల్యే ఆసక్తిగా తిలకించారు. రెస్టారెంట్ ను కలర్ ఫుల్ గా తీర్చిదిద్దారని, యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ఫుడ్ బిజినెస్ కు మంచి డిమాండ్ ఉందని, ఆహార పదార్థాలను రుచి, నాణ్యతతో అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ముందుగా ప్రారంబోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి నిర్వాహకులు గొట్టిపాటి కొండయ్య ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, పిడికిటి వెంకటేశ్వర్లు, ఉప్పుటూరి శ్రీనివాసరావు, చిలకపాటి మధుబాబు, పోకూరి రాంబాబు, అల్లం వెంకటేశ్వర్లు, చదలవాడ కొండయ్య, రాయపాటి శ్రీనివాసరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
