డాక్టర్ మువ్వా కొండయ్యతో ఆంధ్ర అబ్బాయి అమెరికా అమ్మాయి

0

 డాక్టర్ మువ్వా కొండయ్యతో ఆంధ్ర అబ్బాయి అమెరికా అమ్మాయి

BSBNEWS కందుకూరు

ఆంధ్ర అబ్బాయి , అమెరికా అమ్మాయి వివాహం చేసుకొని ఒకటి అయ్యారు. వారి బంధువులను చూడడానికి కందుకూరు వచ్చారు. కందుకూరు నియోజకవర్గంలోని వలేటివారిపాలెం మండలం అత్తింటి వారి పాలెం గ్రామానికి చెందిన కంచర్ల వెంకటకృష్ణారావు మువ్వా శాంతి రోహిణి పెద్ద కుమారుడు కంచర్ల కౌశిక్ అమెరికాకు చెందిన బాట్కిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమెరికాలో నివాసం ఉండే వెంకట కృష్ణారావు శాంతి రోహిణిల పెద్ద కుమారుడు కౌశిక్ అమెరికాలో ఎయిర్ ఫోర్స్ కెప్టెన్, బ్యాట్కిన్స్ కూడా ఎయిర్ ఫోర్సులో కెప్టెన్. వీరిద్దరూ ఉద్యోగం చేసే చోట ప్రేమించుకున్నారు. పెద్దలకు వారి ప్రేమ విషయం చెప్పి ఒప్పించి వివాహం చేసుకున్నారు. కృష్ణారావు శాంతి రోహిణలు అమెరికా సిటిజనులుగా కొనసాగుతున్నారు. అమెరికా అమ్మాయిని వివాహం చేసుకున్న కంచర్ల కౌశిక్ కందుకూరులో ఉన్నవారి తాత అయిన ప్రముఖ హోమియో వైద్యులు సిపిఎం సీనియర్ నాయకులు డాక్టర్ మువ్వా కొండయ్య దగ్గర బాల్యంలో  ఉన్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు నివాసం ఉంటున్న అమెరికాలోని చికాగో వెళ్లి అక్కడే ఉంటున్నాడు. అమెరికా దేశంలో ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం చేస్తూ కౌశిక్ అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారి బంధువులను కుటుంబ సభ్యులను చూడడానికి కౌశిక్ దంపతులు రెండు రోజుల క్రితం కందుకూరు వచ్చారు. కందుకూరుకు చెందిన ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ మువ్వా రవీంద్ర కుమార్ కి స్వయాన మేనల్లుడు. కందుకూరు లోని డాక్టర్ మువ్వా కొండయ్య ఇంటికి వచ్చిన అమెరికా అమ్మాయి ఆంధ్ర అబ్బాయిని పలకరించిన విలేకరులకు మహానందంతో వారి వివరాలను పంచుకోవడం విశేషం. కౌశిక్ సతీమణి కూడా కందుకూరు విషయాలను ఆసక్తిగా తన భాషలో భర్త చెపుతుంటే వింటూ సమాధానం చెప్పటం కనిపించింది.

Post a Comment

0Comments
Post a Comment (0)