ఉన్నం లక్ష్మీ నరసింహంకు నివాళులర్పించిన ఎమ్మెల్యే సతీమణి
BSBNEWS -వలేటివారిపాలెం ఫిబ్రవరి 4:
మండలంలోని పోకూరు గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు ఉన్నం లక్ష్మీనరసింహం ఇటీవల మృతిచెందగా బుధవారం దశదినకర్మ జరిగింది. ఈ కార్యక్రమానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సతీమణి సౌజన్య పాల్గొని నరసింహంకు నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారులు వీరాస్వామి, శరత్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
