ఉద్యోగ విజేతలకు ఘన సన్మానం
BSBNEWS - kandukur
కందుకూరుకు చెందిన దమ్ము జయసూర్య గ్రూప్-2 పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఐతే కందుకూరు లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి కష్టపడి చిదివి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యం గా పెట్టుకుని నేడు తన లక్ష్యాన్ని చేరుకున్న జయసూర్య ఎవరో కాదు ఇపుడు బి.ఆర్.ఆక్స్ ఫర్డ్ విద్యాసంస్థల డైరెక్టర్స్ గా ఉన్న జి.బాల భాస్కరరావు, బి.నరేంద్ర బాబు ల శిష్యుడే. ఇదే విధంగా మరో విద్యార్థిని బిందు యోజిత కష్టపడి చదివి కెనరా బ్యాంకు (PO) గా ఉద్యోగం సంపాదించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఒకప్పుడు వారి వద్ద చదువుకున్న కృతజ్ఞతా భావంతో ఆప్యాయంగా పలకరించడానికి మంగళవారం కందుకూరు బి.ఆర్ ఆక్స్ ఫర్డ్ కాలేజ్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా వారికి కాలేజీ విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించి సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఒక లక్ష్యం పెట్టుకుని ఆ దిశగా పయనించి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఇంటర్ దశలో ఉన్నపుడు మన పై ఉపాధ్యాయులు కాస్త కఠినంగా వ్యవహరించినప్పటికీ అది మన మంచికే అన్నట్లు విద్యార్థులు ముందుకు పోవాలన్నారు. డైరెక్టర్స్ మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాన్ని చేరుకున్న మా పూర్వ విద్యార్థులకి విద్యా బోధన అందించినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కరరావు, కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు,ప్రిన్సిపాల్స్,ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
