విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందజేత
BSB-NEWS-KANDUKUR
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థితికి ఎదగాలని కందుకూరు బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ మేనేజర్ ఎస్ మహేంద్ర కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలో బ్రాహ్మణ పాలెం నందు ఉన్న ప్రాథమిక పాఠశాలలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సి ఎస్ ఆర్ నిధుల ద్వారా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ మహేంద్ర కుమార్ మాట్లాడుతూ విద్య ఒక్కటే జీవితాన్ని మార్చేస్తుందని అన్నారు. తమ బ్యాంకు సి ఎస్ ఆర్ నిధుల ద్వారా విద్యార్థులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్స్ కే అనిల్ కుమార్, జి నవీన్ కుమార్, బ్యాంకు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
